Jesus Songs in Telugu Lyrics
Lyrics: unknown || Tune: unknown
Music: unknown || Album: unknown
ప: ఈ బాటసారికి నమ్మిక నీవే -
ఈ బాటసారికి ధైర్యము నీవే
ఆ బాటలో నా ప్రాణం నీవే -
ఆ బాటలో నా గానం నీవే ||2||
నీవే మార్గం యేసయ్యా -
నీవే సత్యం యేసయ్యా
నీవే జీవం యేసయ్యా -
నీవే సర్వం యేసయ్యా
నీవే మార్గం, నీవే సత్యం
నీవే జీవం యేసయ్యా ||ఈ||
1. ఆశల శిఖరం వేదన అంతం -
ఆర్తుల శరణం నీవే నీవే
అనురాగ దీపం అపురూప బంధం -
అన్యోన్య ప్రేమ నీవే నీవే ||2|| ||నీవే||
2. . నీవే నా మోక్షం, నీవే నిరీక్షణం
ఆత్మానందం నీవే నీవే
ఇహలోక సౌఖ్యం పరలోక భాగ్యం -
నిత్యానందం నీవే నీవే ||2|| ||నీవే||