Type Here to Get Search Results !

ఎక్కడెక్కడో పుట్టి ( ekkadekado putti Song Lyrics | Telugu Christian Songs Lyrics )

 Lyrics: unknown || Tune: unknown 

Music: unknown || Album: unknown 


ఎక్కడెక్కడో పుట్టి - ఎక్కడెక్కడో పెరిగి-

చక్కనైన జంటగా - ఇద్దరొక్కటగుటేమిటో

దేవుని సంకల్పం - ఇది సృష్టిలో విచిత్రం 


1. ఒంటరి బ్రతుకును విడిచెదరు - 

ఒకరికొరకు ఒకరు బ్రతికెదరు.

పెళ్ళినాటి నుండి తల్లి దండ్రుల వదలి- 

భార్యభర్తలు హత్తుకొనుటేమిటో ||దేవుని|| 


2. గతకాల కీడంతా మరచెదరు - 

మేలులతో సంతసించెదరు.

పెళ్ళినాటి నుండి ఒకరి కష్టం ఒకరు - 

ఇష్టముతో పంచుకొనుటేమిటో ||దేవుని|| 


3. ఫలియించి భూమిని నింపెదరు - 

విస్తరించి వృద్ది పొందెదరు

పెళ్ళినాటి నుండి మా కుటుంబం అంటూ-

ప్రత్యేకముగ ఎంచుకొనుటేమిటో ||దేవుని|| 


Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads Section