Type Here to Get Search Results !

బలిపూజలో పాల్గొన వేగమే ( balipoojalo palgona vegame Song Lyrics | Telugu Christian Songs Lyrics )

Lyrics: unknown 

Tune: unknown 

Music: unknown 

Album: unknown 


బలిపూజలో పాల్గొన వేగమే 

రారండి జనులారా 

ప్రభుదీవెన పొందగ వేగమే 

రారండి ప్రియులారా 

ఇది దైవసుతుని త్యాగం 

మన పాప పరిహారార్థం 

ఒసగిన దేవుని ప్రేమ బలిదానం ||బలి|| 


1. సమత మమతల కోసం శాంతి స్థాపన కోసం 

దేవుడే మానవుడై అవతరించెను

దీనులను హీనులను కనికరించెను 

పూజింపరారే స్తుతియించరారే 

సేవించరారే దేవాది దేవుని 

పూజలో పాల్గొని నవజీవం పొందరే ||బలి|| 


2 మానవరక్షణ కోసం మనుజాళి మనుగడకోసం 

తన ప్రాణం తన సర్వం త్యాగం చేసెను 

ప్రేమాజ్ఞను పాటింపగా గురుతుగనిచ్చెను 

పూజింపరారే స్తుతియించరారే 

సేవించరారే దేవాది దేవుని 

పూజలో పాల్గొని నవజీవం పొందరే ||బలి|| 


Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads Section