Lyrics: unknown || Tune: unknown
Music: unknown || Album: unknown
దేవాది దేవా దివ్య ప్రభువా ` మా స్తుతును గొను మా ప్రభురావా
సతతము నిన్ను సర్వ ప్రపంచం ` ఆరాధనతో కొలుతుము నిత్యం
1 వ చరణం..
స్వామి సన్నిధులు శక్తి సంయుతులు
సెరఫిము కరుచిము దూతఘనములు
పరిశుద్ధ పరిశుద్ధుడ వంచు `
స్తుతి చేయును సృష్టి నాధుడవంచు
2 వ చరణం..
దివి భువి నీదగు మహిమ ప్రపూర్ణం
ప్రవక్త ప్రభు శిష్య ప్రస్తుతి జాలం
ఆశువుల నిచ్చిన యెల భక్త రూపం
నీ కీర్తి మహిమ పొగడిరచు సతతం
3 వ చరణం..
శ్రీసభ నితరం సంస్తుతి చేసి ` కీర్తించును నిన్ను కరములు మోడ్చి
ఏకైక నాధుని యెలవరధాతను
మహిమాయుతులును మరి మరి పొగడెన్
4 వ చరణం..
రవి విభతేజా రారాజు తనయ ` మనుజ రక్షణకై మరియ సుతుడు
మరణము గెలిచి మోక్షము తెరచి`నిత్య రాజ్యార్హత నెరపుము మాకు
5వ చరణం..
ప్రభు మీద నీవు పిత ప్రక్కవెలిగి
అరుదెంచు నా ప్రభుతో అంత్యమున తీర్పుకై
రక్తధారలతో రక్షించినావు ` నీ మహిమ పాలు మాకిచ్చిబ్రోవు
6వ చరణం..
ఆద్యంత రహిత అరసి రక్షించుము`నిరత రాజ్యమును నీ ప్రజకిచ్చి
నుతిచేతు మన యేసు కీర్తింతు నిరతం
అఖిలాండకోటి ఆరాధ్య దైవం
7వ చరణం..
పాపంబు బాపి నీదయను జూపి`నీయందు భక్తిని నెనరుతో గరిపి
నీ కరుణ మాకై నీ పార చరిడి`సేవింతుమయ్య పరమేశ ఈశ
8వ చరణం..
గతవత్సరమున ఘనవరము లిచ్చి
మము గాచిన దేవ మా నుతులు నీకు
నూత్న వత్సరమున దీవెనలతో
మమ్మేలు కోనవా మా దేవ దేవ t llదేవాll