Lyrics: unknown || Tune: unknown
Music: unknown || Album: unknown
నీసగరిమా మాపగరిసా లాల లాలలా లాల లాలలా
ప: జుంటే తేనె మధురము కన్నా-
మధురమైనదీ విందు
పువ్వులోని వాసనకన్నా -
సుమధురమైనదీ విందు
స్వీకరింపగ రారండి -
ఆరగింపగ రారండి
బలమును ఒసగెడి ఈ విందు -
బ్రతుకును మార్చెడి ఈ విందు
1. నిస్సార జీవితంలో సెలయేటి ఊట యిదియే
నిర్జీవ పయనంలో నవజీవ కాంతి యిదియే
ఆత్మాంధకారం తొలగించు విందిది- ఆత్మ సంతోషం కలిగించు విందిది ||స్వీక||
2. ప్రభు యేసువే మనకు అందించు విందు యిదియే
ఆ నిత్య జీవితమును ప్రసాదించు విందు యిదియే
పాపాంధకారం తొలగించు విందిది-
పరిశుద్దతను కలిగించు విందిది ||స్వీక||