Lyrics: unknown
Tune: unknown
Music: Dr. PJD Kumar
Album: ద్రాక్షవల్లి
ప. మధురమైన నామము
మరువలేని నామము మది నిండా వున్నది.
నీ నామము.....నా యేసువా
1 సుఖములోను దు:ఖములోను
మరువలేను నీ నామం
వ్యాధులలోను బాధలలోను
మరువలేను నీ నామం
2. నిదురలోను మెలుకువలోను
మరువలేను నీ నామం
సిరులలోను చింతలలోను
మరువలేను నీ నామం
3. పనులలోను పయనములోను
మరువలేను నీ నామం
శాంతిలోను సమరములోను
మరువలేను నీ నామం