Song Lyrics in Telugu
కుమ్మరి ఓ కుమ్మరి జగతుత్పత్తిదారి
జిగట మన్నైన నా వంక చల్లగా చూడుమయ్యా
పనికిరాని పాత్రనని పారవేయకుమా
పొంగి పొరలు పాత్రగా నన్ను నింపుమయా ||కుమ్మరి ||
సువార్తలోని పాత్రలన్నీ శ్రీ యేసుని పొగడుచుండ
సాక్షిగా నుండు పాత్రగాజేసి సత్యముతో నింపుము తండ్రీ ||కుమ్మరి ||
విలువలేని పాత్రను నేను కొనువారు లేరెవ్వరు
వెలలేని నీదు రక్తంబుతో వెలుగొందు పాత్రగా చేయుమయ్యా ||కుమ్మరి ||
ఆటంకముల నుండి తప్పించి నన్ను ఎల్లప్పుడూ కావుమయ్యా
పగిలియున్న పాత్రను నేను సరిచేసి వాడుమయ్యా ||కుమ్మరి ||
Song Lyrics in English
Kummari o Kummari Jagatuthpattidari
Jigata mannaina naa vanka challaga choodumayya
Panikiraani paathrani paaraveyakumaa
Pongi poralu paathraga nannu nimpumayya ||Kummari ||
Suvaarthaloni paathralanni Sri Yesuni pogaduchunda
Saakshiga nundu paathragaajeshi satyamuto nimpumu tandri ||Kummari ||
Viluvuleni paathrani nenu konuvaaru leravvuru
Velaleni neethu raktambu tho velugondu paathraga cheyumuayya ||Kummari ||
Aatankamula nundi tappinchi nannu ellappudu kaavumayya
Pagiliyunna paathrani nenu saricheshi vaadumayya ||Kummari ||