Lyrics: unknown || Tune: unknown
Music: unknown || Album: unknown
లోకానికిదియే పర్వదినం
ప్రభు యేసు పుట్టుక మహోదయం ||2||
రారండీ దైవజనమా
ప్రభు యేసు అరుదెంచెను
పాడండి క్రీస్తు గణమా-ప్రభు క్రీస్తు జన్మించెను
We wish you happy Christmas
We wish you merry Christmas ||2||
||లోకానికిదియే||
1. పరలోకనాధా దైవతనయా-మము బ్రోవవా
భువినేలు రాజా-దివ్యతేజా-పాలించవా ||2||
దనిరిసనిస ||2||
మరియ తనయా-పరమ ప్రభువా
పావనాత్ముడివేగా మనుజరూపా
పరమ విభువా తనివి తీరెను దేవా
పదమా స్వరమా పుడమంత పొంగి
పాడిందిలే - పులకించి ప్రభు రాకతో
||లోకానికిదియే||
2. యేహోవా షమ్మా-ఎల్జడాయే-దీవించవా
షాలోము రాజా-యేసుదేవా-నడిపించవా ||2||
పాపశాపము పారద్రోల మాకై ఏతెంచినావా
ముక్తినొసగే రక్షకుడివై మాతో నిలిచావుదేవా
హృదిలో-జగతిలో మనసార నిన్ను కీర్తింతుము
ప్రభు యేసు నీ రాకను .
||లోకానికిదియే||