Lyrics: unknown || Tune: unknown
Music: unknown || Album: unknown
స్వాగతం ప్రజలారా స్వాగతం
ప్రభుని బలిపూజకు స్వాగతం
ఆహ్వానం రారాజు క్రీస్తునకు
సమాధాన కర్తకు స్వాగతం
స్వాగతం స్వాగతం ప్రభుపూజకు స్వాగతం
1 వ చరణం..
ఈ భువి కేతెంచిన దైవ పుత్రుడు
పావనపిత రూపమైన క్రీస్తు దేవుడు
అతడే ఏకైక మధ్యవర్తి ఇలకు
అపవాదిని జయించు అధిపతి మనకు
2 వ చరణం..
మహోన్నతమున దేవునికి స్తుతులు
ప్రభువు కనికరించిన వారికి శాంతి
సంతోష సౌభాగ్యము లొసగే ఆ దేవుని
రక్షణబలిలో పాల్గొందము రారండి