Lyrics/Tune: Joseph Konda
Music: Praveen M
Album: పరిశుద్ధాత్మ సన్నిధి - 3
ఎక్కడ ఉన్న నీ వాక్యమునే ` పఠియింతును దేవా
ఏం చేస్తున్నా నీ నామమునే ` ధ్యానింతును ప్రభువా
నీ ధ్యాసలోనే తరియింతును ` నీ సన్నిధికై తపియింతును ||2||
యేసయ్యా నా యేసయ్యా`కడదాక నిన్నే కాంక్షింతునయ్యా ||2|| llఎక్కడll
1 వ చరణం..
నేలమంటిని తీసి నన్ను సృజియించినావు
నీదు జీవమును పోసి నీలాగ మార్చినావు
నీతిమంతునిగ నను నిలిపినావు ||2||
నీ సేవలో నను హెచ్చించినావు ||2|| llయేసll
ఆ......ఆ......ఆ........... llఎక్కడll
2 వ చరణం..
ప్రవహించే జలములనాపి ` చక్కని బాటవేసావు
శత్రువులు నీటిలో ముంచి ` నన్ను గమ్యానికి చేర్చినావు
ఎన్నెన్నొ అద్భుతకార్యాలు చేసావు ||2||
ఎదలోన నీవుండి స్థిరపరచినావు ||2||
llయేసాయ్యా|| llఎక్కడll