Lyrics: unknown || Tune: unknown
Music: unknown || Album: unknown
ప. ఎంతో మంచి దేవుడవయ్య
ఎన్నో మేలులు చేసిన దేవా
ధూపారాధన దీపార్చనతో
నా సర్వం అర్పించెదనయ్య Ilఎll
1. ఆలయగంటల నాదాలే
నీ కోవెల చేరగ పిలువగ
ఏమిలేని బిడ్డనైతిని
నీ ముందు నే నిలువగా ||2||
నాకున్నదంతయు నీవిచ్చినదేగా
సంతోషముతో సమర్పించెద Ilఎll
2. ఆకాశంలో దేవదూతలు
నీ స్తుతి గానం చేయుచుండ
నేకొనివచ్చిన దీనకానుక
నమ్మకమైన దేవా నీకు ||2||
ఆనందంతో అర్పించెద స్వామి
అంగీకరించి ఆదరించుమా Ilఎll