Lyrics: unknown || Tune: unknown
Music: unknown || Album: unknown
ఇదిగో క్రీస్తు శరీరం .... ఆమెన్
ఇదిగో క్రీస్తు రక్తం .... ఆమెన్
సా నిదని దమదా - సనిదమ గమదని
సా సా నిద నీనీ గమ దాదా - సనిదమ గమదని
ప్రభుని విందు మధురం - మధురం మధురం
ప్రభుని పొందు నిరతం - నిరతం నిరతం
ప్రభుని ముందు శరణం - శరణం శరణం
ప్రభుని యందు అమరం - అమరం అమరం
యేసు క్రీస్తు ఇల నిలిపిన - ప్రేమ విందు
అతి మధురం llప్రభుll
1 వ చరణం..
స్లీవ మీద జాలువారు - రుధిరామృత స్రవాలే
లోక పాప శాపధూళి - ప్రక్షాళన ధారలై ll 2 ll
ప్రేమలయమై - ఇల జీవ నిలమై ll 2 ll
మానవాళి విమోచన - యోగానికి మూలమైన .... llప్రభునిll
2 వ చరణం..
నేటి నుండి మీతోనే - కలకాలం నివాసం
అన్నమాట అనుసారం
ప్రసాదించే సహవాసం ll 2 ll
అజ్ఞాతముగ - మన అదృష్టముగా 2
అవని బ్రోవ ఆ దైవమే
అరుదెంచే యోగమైన ..... llప్రభుll