Lyrics: unknown || Tune: unknown
Music: unknown || Album: unknown
సరిమప మపనిస రిసనిస రిసరిస నిప నిపమప రిమ పని పమ రిస నిస రిమ పనిస.... ఆ.... ఆ.... ఆ....
పల్లవి:
కళకళలాడె కల్వరి ప్రేమ బలిపూజకు తరలిరండి ||2||
కరతాళ ధ్వనులతో మన దేవుని స్తుతియించరండి ||2||
మంజుల హృదయాల దీపాలు వెలిగించుదాము ||2||
అంజలి గీతాల హారతులు అర్పించుదాము కోరస్: రండీ దైవ జనమా విశ్వాస మార్గములో పయనింప రండు ప్రభుని ఆరాధింతుము ll3ll (లేక)
ఇదిగో శిలువ మ్రాను దీనియందే లోక రక్షకుడు వ్రేలాడెను రండు ప్రభువుని ఆరాధింతుము ll3llllకళll
1 వ చరణం..
ఆత్మ దేవుని శక్తి మన పీఠంపై దిగిరావాలని ||2||
తండ్రి పావన హస్తం మన కాపరిపై నిలవాలని ||2||
క్రీస్తు ప్రేమ కుసుమం మన గురువులలో విరియాలని ప్రార్థించ రారండి మనసారా ||2||
ప్రియులారా... llకళll
2 వ చరణం..
సమత మమతల దీపం ప్రతి కంటిలో మెదలాలని ||2||
ధర్మం న్యాయం సత్యం ఎద ఎదలో కదలాలనీ ||2||
క్రీస్తు శాంతి రాజ్యం మన సంఘంలో వర్థిల్లలనీపాల్గొన రారండి జనులారా ||2||
ప్రియమారా.... llకళll
స్వాగతం... సుస్వాగతం ఈ దివ్యబలికి ఘన స్వాగతం స్వాగతం... సుస్వాగతం స్వాగతం ఘనస్వాగతం