Lyrics: unknown || Tune: unknown
Music: unknown || Album: unknown
కరుణించి కావుము కరుణామయా -
కారుణ్య మూర్తివి శ్రీ యేసయ్యా
లోకాన పాపం పరిహరించు -
దేవుని గొఱ్ఱపిల్ల శ్రీ యేసయ్యా
1. తల్లి తిరుసభను దీవించు -
కరుణతో మమ్ము నడిపించు
నీ హృదయ దాహమును -
తీర్చువారిని పంపించు
నీవే శరణం యేసయ్యా -
నీవే అభయం యేసయ్యా
2. పాపముతో నశించిపోవు -
ఈ లోకముపై దయచూపు
పశ్చాత్తాప హృదయమును -
మాలో స్వామి సృజియించు
నీవే శరణం యేసయ్యా -
నీవే అభయం యేసయ్యా