Lyrics: unknown || Tune: unknown
Music: unknown || Album: unknown
దైవానికే ముళ్ళ కిరీటం ఈలోకమే విషవలయం-
సుకుమార దేహం వడగాలిలో
పువ్వల్లె వాడే ఇది ఏమి ఘోరం -
కన్నీరు ఏరై పొంగేనులే
1. ద్రోహుల పాపం తను స్వీకరించే -
ఆ త్యాగమునకు ప్రతి ఫలము ఇదియా తను కన్న బిడ్డ అల్లాడు వేళా -
ఆ మేరి హృదయము పగులునేమో
సిలువను మోసి... మృదువైన భుజము నలిగేనులే
2. మేఘాలు కమ్మి వడగండ్లు కురిసే –
ఈలోకమంతా ప్రళయమేగా
రాజాధిరాజా జగదేక కర్తా - బలి త్యాగమునకు
కరుణామూర్తి ప్రేమ మూర్తి లోక నాయకా