Lyrics: unknown || Tune: unknown
Music: unknown || Album: unknown
దావీదుపేట ఘల్లుమన్నది-
ఊరువాడంత జల్లుమన్నది
మా రాజు యేసు మరణాన్ని గెలిచి -
లోకాన చావు లేకుండా చేసి
రారె పోదామయ్యా అన్నలారా! -
తీరా చూద్దామయ్యా కన్నులారా!
1. మగ్గలేన మరియ పరుగెత్తి పోయింది
ప్రభు పడక చూసింది ||2||
తన రాజు లేడని తనలోన వగసింది
తబ్బిబు అయ్యింది ||2||
దూత చెప్పిన మాట దూరంగ వినుకొని
యేసు లేచాడని ఎలుగెత్తి చాటింది ||రారే||
2. ఎమ్మావు దారిలో యేసయ్య నిలిచాడు -
బాటెంట నడిచాడు ||2||
బాట సారులతోటి మాట్లాడుతున్నాడు
మంచి చెడ్డడిగాడు ||2||
కూచోని వారింట భోంచేసుకున్నాడు
చూత్త చూత్త వుంటే చుక్కల్లో కలిశాడు ||రారే||