Lyrics: unknown || Tune: unknown
Music: unknown || Album: unknown
దీవెనలు కురిపించు - ఈ వరునిపై -
దండిగా కురిపించు - ఈ వధువుపై
దినదినము - నడిపించు మీ ప్రేమలో -
దివ్యంగా జీవింప వరమీయుమా
1. నోవా కుటుంబాన్ని ఆదరించినావు -
జల ప్రళయము నుండి రక్షించినావు
ఫల ప్రదము కమ్మని - దీవించినావు -
నీ ప్రేమ వరములు - కురిపించినావు
2. అన్నా మనవులను - మన్నించినావు -
రెబకా ప్రార్థను - ఆలించినావు
జకరయ్య నమ్మకం - గుర్తించినావు -
నీ ప్రేమ సంతతిగ ఇల మలచినావు
3. కష్ట సుఖాలలో తోడుగ నుండుము -
కలిమి లేములలో అండగ నుండుము
వ్యాధుల బాధలలో నీడగ నుండుము -
వసుదైక జంటగ మలచుము వీరిని