Lyrics: unknown || Tune: unknown
Music: unknown || Album: unknown
ప. దేవర నీ దీవెనలు ధారాళముగను వీరలపై
బాగుగ వేగమె దిగనిమ్ము
పావన యేసుని ద్వారగను ||దే||
1. దంపతులు దండిగ నీ
ధాత్రిలో వెలయుచు సంపదలన్
సొంపుగ నింపుగ పెంపగుచు సహింపును
వీరు సుఖించుటకై ||దే||
2. ఈ కవను నీ కరుణన్ ఆఖరు
వరకునులోకములో
శోకము లేకయే యేకముగా
ప్రకటముగను జేకొనుము ||దే||
3. ఇద్దరు వీరిద్దరును శుద్దులై
నిన్ను సేవించుటకై
శ్రద్దతో బుద్దిగ సిద్దపడన్
దిద్దుము నీ ప్రియ బిడ్డలుగా ||దే||
4. వాసిగ నీ దాసులము
చేసిన యీ మొరల్ దీసికొని
మా సకలేశ్వర నీ సుతుడౌ
యేసుని పేరిట బ్రోవు మామేన్. ||దే||