Lyrics: unknown || Tune: unknown
Music: unknown || Album: unknown
ప. జయజయ మూర్తులు జననాధా
మీరు దేవకుమారులయ్యా
యేసునాధా ||జయ||
1. అర్థరాత్రికాల మందు జననాధా
మీరు అవతరించినారయ్య
యేసునాధా ||జయ||
2. పశువుల కొట్టమందు జననాధా
మీరు పవ్వళించి యుండగాను
యేసునాధా ||జయ||
3. సన్మనస్కులొచ్చినారు జననాధా
మిమ్ము సంభ్రముతో వేడిరయ్యా
యేసునాధా ||జయ||
4. పరమండలము నుండి జననాధా
మీకు పరమ దూతలొచ్చిరయ్య
యేసునాధా ||జయ||
5. ఎనిమిదవ దినమున జననాధా
మీకు ఏసువను పేరిడిరయ్య
యేసునాధా ||జయ||
6. కన్యకుమారుడైన జననాధా
మమ్ము కరుణతో రక్షించరమ్ము
యేసునాధా ||జయ||
7. మరియ ప్రియ పుత్రులైన జననాధా
మీరు మా పాలి తండ్రులయ్యా ||జయ|| యేసునాధా ||జయ||