Lyrics: unknown || Tune: unknown
Music: unknown || Album: unknown
జీవనాధుడు జనియించే ` స్వాగత గీతం పాడండి ||2||
సుందర రూపుని వేడండి ` శుభములు పొందగ రారండి llజీవll
1 వ చరణం..
పరిశుద్ధాత్మ, ప్రభావ మహిమయే
కన్యమరియలో ఉదయించెనులె
కరుణ కాంతులే కురిపించెనులె
రక్షణ స్రవంతి వినిపించెనులే llజీవll
2 వ చరణం..
విశ్వ జ్యోతియై విశ్వమంతను ` దేదీప్యముగా దీవించెనులే ||2||
జ్ఞానజ్యోతులను వెలిగించునులే
అంధకారమును తొలగించెనులే llజీవll
3 వ చరణం..
కీర్తిమంతుడై కార్యధీరుడై ` దైవరాజ్యము స్థాపించుటకై ||2||
ధర్మపాలనం నెలక్పొల్పుటకై
ప్రేమ రాజ్యమును నిర్మించుటకై llజీవll
4 వ చరణం..
మనసు మనసులో మమకారమునై
మనిషి మనిషిని ప్రేమించుటకై
సమత మమతలు నేర్పించుటకై
సమజీవనము సాగించుటకై llజీవll
5వ చరణం..
సేవాభావం బోధించుటకై ` సేవలు చేసి చూపించుటకై ||2||
సేవక ధర్మం నెరవేర్చుటకై ` సేవలోనే తరియించుటకై ||2||
llజీవll
6వ చరణం..
దేవుని సుతుడు దీనుల తేజుడు`పరమాత్ముండు పరంధాముడు
పరముపదములో నడిపించుటకై -
పరమ ప్రేమను చూపించుటకై ||2||
llజీవll