Lyrics: unknown || Tune: unknown
Music: unknown || Album: unknown
జో.. జో... లాలి... జో...జో... లాలి
ప. అవతారమెత్తినట్టి - ఆది దేవుండకు
అంజలలు నివ్వరారే
అందరు చేరి నిటకు ||2||
జోజోజో లాలి యేసయ్యా
జోజోజో చిన్నారి యేసయ్యా ||అ||
1. అంధకారములోని జనులకు
ఆ ప్రభువే వెలుగాయెను
అపరాధులైన ప్రజలకు
ఆ ప్రభువే జ్యోతి ఆయెను ||జో||
2. ఆబెత్లహేమను గ్రామము
అదృష్టంబును పొందెను
ఆ రీతిగాను మన మందరం
ఆ ప్రభువు రక్షకుని పొందుదాం
జోజోజో లాలి యేసయ్యా
జోజోజో చిన్నారి యేసయ్యా ||అ||
3. ఆ దూత గణముల గానముల్
ఆ ప్రభుని మహిమను చాటెను
ఆ జ్ఞానత్రయమను బృందము
ఆ ప్రభుని ఆశీస్సులొందెను జోజోజో లాలి
యేసయ్యా జోజోజో చిన్నారి యేసయ్యా ||అ||