Lyrics: unknown || Tune: unknown
Music: unknown || Album: unknown
పల్లవి:
మా దేవుని ఉత్సవము మా క్రీస్తుని సంబరము
మా గురువుల ప్రేమోత్సవము ||2||
రండి ప్రియులారా రండి కథోలికులారా... ||2||
ఆరాధించుదాం ఆనందించుదాం... ||2||
మనసారా దీపం ధూపం పుష్పం హారతులిడుదాం...llమా దేవునిll
1.తొలికూతవేళ ఉత్థాన ఘడియలు `
మదినిండుగా ప్రభువుండగా ||2||
కలువరి బలిలో జీవింపా .... ||2||
ఉత్సాహించుదాం ఉల్లాసించుదాం... ||2||
వినయముతో శిరము వంచి ప్రభుని ప్రార్థించుదాం...llమా దేవునిll
2.మట్టి మనిషిని బంగారు మనిషిగా`
మార్చే ప్రభు బలిని స్మరియించుదాం ||2||
కరములు మోర్చి పూజింప... ||2||
ఆహ్వానించుదాం ఆహ్లాదించుదాం... ||2||
ముదమున తనువు మనసు పరచి పరవశించుదాం..llమా దేవునిll