Lyrics: unknown || Tune: unknown
Music: unknown || Album: unknown
ప: మా దేవుని మందిరము
పరమాత్ముని ఆలయము
శ్రీ యేసుని పరిమళ సూత్రాలు
ప్రభవించెను ప్రేమ ప్రసూనాలు ||మా||
1. జీవ జలమునిడు నిత్యధారగా
నీదు దీపముల నిండుజ్యోతిగా ||2||
వెలసినది మందిరము
నిలచినది దేవళము ||మా||
2. సంఘ జీవన శుభాంక పీఠమై
చిన్మయుడగు పరమాత్మ చిహ్నమై ||2||
దివ్యముగా దీవెనగా
నిలచినది మందిరము ||మా||
3. ఆందోళిత ప్రజ కాత్మపైన శాంతిగ
తమోపంకముగ తామర సుమమైt ||2||
వెలసినదీ మందిరము నిలచినదీ దేవళము llమాll