Lyrics/Tune/Prod: Fr. Lamu Jayaraju
Music: Naveen M
Album: వాక్యప్రకాశిని
ప: మా హృది కుహరమే మందిరమై
అరుదెంచిన ఓ శ్రీ యేసా
మనసాలయమున కీర్తించెదము
కరుణతో మమ్ముల దీవించి ||2|| ||మా||
1. నీకే అంకితము మా బ్రతుకుల్
నీకిచ్చుటయే అతిమధురం
నీదు ప్రేమలో నన్ను నిలిపి
జ్ఞాన జ్యోతిని ప్రసరించుమయ్య ||2|| ||మా||
2. చల్లని నీదు సన్నిధిలో
నీ ఆరాధనే మాకానందం
చంచలమైన మా మనసులలో
శాంతి జ్యోతిని వెలిగించుమయ ||2|| ||మా||