Lyrics: unknown || Tune: unknown
Music: unknown || Album: unknown
ప. హృదయాంతరంగాలతో
ప్రభుని ప్రేమామృతం
ప్రేమానురాగాలతో
ఆ దివ్య జీవామృతం ||2||
నా మనసారా ఆరగింతును ||2||
1. ఆత్మీయ ఆకలితో - ఆలసియున్న వారా
పాపక్షమాపణకు - పరితపించు వారా ||2||
ముదమార రారే - ఆ విందు లోకొందుము
2. శాంతిని వెదుకు వారా - నీతిని కోరువారా
దీనమనస్సులారా - దీవెన కోరువారా ||2||
త్వరపడి రారే - ఆ ప్రభుని లోకొందము
3. నా మూగమానసమా - నా పాప దేహమా
అవినీతి నా మార్గమా - దుర్మార్గ నా దీపమా ||2||
ఏతెంచి రారే - ఆ విందు లోకొందుము