Lyrics: unknown
Tune: unknown
Music: Dr. PJD Kumar
Album: ద్రాక్షావల్లి
ప. శుభవచనం ప్రభు వచనం
యేసుని సందేశం క్రీస్తుని సువిశేషం ||2||
నశియించు ఆత్మలను రక్షించు
ప్రభువాక్యం ||2||
అల్లెలూయ - అల్లెలూయ ||8||
1. గలిలయ సంద్రమున గాలిని అణిచిన వాక్కు
నీటిని ద్రాక్షరసముగను
ప్రేమతో మార్చిన వాక్కు ||2||
అంధులకు రోగులకు
స్వస్థత నిచ్చిన వాక్కు ||2||
ఘనత మహిమ యేసుకే చెందును ||2|| అల్లెలూయ ||8||
2. నాయిను గ్రామమున
యువకుని లేపిన వాక్కు
సాతాను శక్తులను
ఆజ్ఞతో అణచిన వాక్కు ||2||
పాపులకు దీనులకు రక్షణనిచ్చెడి వాక్కు ||2||
ఘనత మహిమ యేసుకే చెందును ||2|| అల్లెలూయ ||8||