Lyrics: unknown
Tune: unknown
Music: unknown
Album: పవిత్రాత్మ స్వరం
ప. శాశ్వత జ్యోతికి - ప్రతిరూపం
దేవుని శక్తికి - ప్రతిబింబం ||2||
అమర ప్రేమను - చాటే వాక్యం ||2||
సకల జనాన్ని - నడిపే వాక్యం ||2||
1. సృష్టికి - రూపమును ఇచ్చే వాక్యం
భువిలో వెలుగును - నింపే - వాక్యం ||2||
ప్రేమానురాగాలు - పంచే - వాక్యం ||2||
మనిషికి ప్రాణం - పోసే - వాక్యం
విశ్వమూర్తిగా - మనకు సాక్షిగా
వెలసిన తండ్రి - వాక్యం
2. మానవరూపం - దాల్చే వాక్యం
మనిషిలో - మమతను పెంచే వాక్యం ||2||
వాక్య మర్మమును - వర్ణించే వాక్యం||2||
రక్షణ మార్గము - చూపే - వాక్యం
అమర జీవిగ - ఆత్మరూపులో
వసించు - తండ్రి వాక్యం ||శా|| హల్లె||4||