Type Here to Get Search Results !

ఇది మరచిపోలేని మానవోత్తముడు ( idhi marachipoleni manavothamudu Song Lyrics in Telugu | Telugu Christian song lyrics )

 Lyrics: unknown || Tune: unknown 

Music: unknown || Album: unknown 


ప. ఇది మరచిపోలేని మానవోత్తముడు

మహిలో నిలిపిన మహా విందు 

ఇది అద్వితీయుడగు అతిధిదేవుడు

అవనికరుదెంచు ఘనవిందు 

ప్రభుజనులారా పాల్గొనరారే

పరమ ప్రసాదం ఈవిందు ||ఇది|| 


1. ఇల అలముకొన్న ఈ అంధకారమున

వెలుగు నింపు విందు 

పాప శాపములు పరిహరించేటి 

దివ్యమైన విందు 

సేదను తీరగ రారండి 

భారభరితులకు శాంతికరమైన

పరమ ఔషధం ఈవిందు ||ప్ర|| 


2. ఇలమరచియున్న ఆ మానవత్వమును

మేలుకొలుపు విందు-పొరుగువారికి ప్రేమ

పంచుమని ప్రోత్సహించు విందు 

సేవలు సేయగ రారండి 

మంచి మనుజులకు మేలుకరమైన 

మాతృ సంజీవని ఈ విందు ||ప్ర|| 


Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads Section