Lyrics: unknown || Tune: unknown
Music: unknown || Album: unknown
కనులుండి చూడలేదు నీ మహిమను -
చెవులుండి వినలేదు నీ మాటను ||2||
కాళ్ళువుండి నడువలేదు నీ బాటను -
చేతులుండి చేయలేదు నీ పనులను ||2||
పాపుల కొరకై ప్రాణం విడచినదేవా -
ఈ పాపి బ్రతుకును మార్చుము దేవా
1. చల్లగా లేనయ్య వెచ్చగా లేనయ్యా -
నులివెచ్చని తనముతో బ్రతుకుచుంటినయ్యా ||2||
నీ నోటి నుండి ఉమ్మివేయకయ్యా -
బలహీనుడనైన నన్ను బలపరచుమయ్య
పాపుల కొరకై ప్రాణం విడచిన దేవా -
ఈ పాపి బ్రతుకును మార్చుము దేవా||2||
2. దుష్టుల సలహాలతో దుర్మార్గపు పనులతో -
ఈలోక ఆశలలో మునిగిపోతినయ్యా
నీ సన్నిధినుండి నన్ను గెంటి వేయకయ్యా-
పరశుద్ద వస్త్రమును నాకు కప్పుమయ్య ||2||
పాపుల కొరకై ప్రాణం విడచిన దేవా-
ఈ పాపి బ్రతుకును మార్చుము దేవా ||2||