Lyrics: unknown || Tune: unknown
Music: unknown || Album: unknown
ప: కోటి సూర్యుల కాంతులతో
సర్వజగమును వెలిగించే ||2||
నీతి సూర్యుడు యేసు దేవుని
సంతసముతో కొలిచెదము ||2|| ||కోటి||
1. వెలుగులు నింపే ప్రభు యేసా
చీకటి బాపిన నవ జ్యో తి ||2||
ప్రభు! నీ వెలుగులో నడిపించు
జీవన జ్యోతివై ప్రభవించు ||2|| ||కోటి||
2. సత్యము పలికిన బోధకుడా .
వంచన విరచిన సాధకుడా ||2||
సత్యము మాకు నేర్పించు
సత్య మార్గములో నడిపించు ||2|| ||కోటి||
3. మృతినే గెల్చిన ప్రభుయేసా
జీవము నిల్పిన ఓ దేవా ||2||
శాశ్వత జీవం మాకొసగు
అమర జీవియై పాలించు ||2|| ||కోటి||