Type Here to Get Search Results !

దేవదేవుడు స్వయముగా ( devadevudu swayamuga Song Lyrics | Telugu Christian Songs Lyrics )

Lyrics: unknown || Tune: unknown 

Music: unknown || Album: unknown 


ప: దేవ దేవుడు స్వయముగా నను పిలిచినట్లుంది 

ఆది దేవుని స్వరము చెవులకు తాకినట్లుంది

అంధకారము కనుల నుండి జారినట్లుంది

దివ్య సన్నిధి కనుల ఎదుట నిలిచినట్లుంది ||దేవ|| 


1. కలుషమంతా బాష్పధారల కరిగినట్లుంది

పాపమంతా అగ్ని జ్వాలల కాల్చినట్లుంది

క్రీస్తువే తన రక్త ధారల కడిగినట్లుంది

పరమ వైద్యుని హస్తమే నను తాకినట్లుంది ||దేవ|| 


2. విశ్వమంతా ప్రభుని ప్రేమను పరచినట్లుంది

ప్రభుని నామము అన్ని దిక్కులు మారు మ్రోగింది

భూదిగంతము లేకమై ప్రభు కీర్తిచాటింది

దివ్యనామము గగనమంతా విరిసి మెరిసింది ||దేవ|| 


Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads Section