Lyrics: unknown || Tune: unknown
Music: unknown || Album: unknown
ప: దివ్య బాలయేసువా మమ్మిల కనరావా
శరణు కోరిన భక్తుల మొరలను దయతో వినరావా
బాలయేసువా - బంగారు యేసువా
భక్త బాంధవా - మా ముక్తిదాయకా ||దివ్య||
1. ఆశగ నిన్ను అడిగిన వారిని నిరాశపరచవని
దీనత కలిగి వేడిన వారికి దిక్కువు నీవె అని
నిన్ను నమ్మి చేరితిమి నమ్మికతో ప్రార్థించితిమి
బాలయేసువా - బంగారు యేసువా
భక్త బాంధవా - మా ముక్తిదాయకా ||దివ్య||
2. నిత్యము నిన్ను తలచేవారిని ఎన్నడు విడువవని
అద్భుత శక్తితో తోడుగ ఉండి ఆశలు తీర్తువని
నిన్ను నమ్మి చేరితిమి నమ్మికతో ప్రార్థించితిమి
బాలయేసువా - బంగారు యేసువా
భక్త బాంధవా - మా ముక్తిదాయకా ||దివ్య||