Lyrics: unknown || Tune: unknown
Music: unknown || Album: unknown
దివ్యమే నీ పాదపూజ బాలయేసువా
మానవ లోకం మంగళ జ్యోతి మామదిలో వెలిగించవా
1. లోకపితా కరుణ సుదా మృదు
మధురసుధారసం చిందించవా
నవవసంత కాలమునే చూపవా -
మా జీవన పూదోటలో వికసించవా
నా వాంఛలేవో ఈడేర్చు కాలం
బాలయేసు చూపించవా ||దివ్య||
2. వేదనతో కుమిలితిమి మాకు
ఒక బాలుని నీవియ్యవా
ముద్దు మాటలే నాడు విందుము
నీ అమ్మకు నీ ఒక బిడ్డవు కావా
మరియమ్మ పుత్ర నా గోడు వినవా
మదిలో వాంఛ నెరవేర్చవా ||దివ్య||