Lyrics: unknown || Tune: unknown
Music: unknown || Album: unknown
జ్ఞానులు తెచ్చిరి కానుకలు -
సుదూర సీమల నుండి
ఆనందంతో అర్పించిరి -
చిన్నారి యేసును చూచి
బంగారు సాంబ్రాణి పరిమళ ద్రవ్యాలతో
ఆరాధించిరి దేవుని కొమరుని -
అర్పించగరండి ఓ దైవజనమా ||2||
మీ ప్రేమ కానుకలు దివ్యమైన తలంపులు
ప్రియమైన హృదయంతో దివ్య బాలయేసునకు
1. లోకాన్ని ఎంతో ప్రేమించిన
పరలోక దేవుడు ఉన్నతుడు
తన దివ్య సుతుని అర్పించిన
ఆ తండ్రి ప్రేమ శాశ్వతము
దైవరాజ్యమును స్థాపింప
నూతన జగమును నిర్మింప
పుడమిన పుట్టిన దేవ దేవుడు
నరావతారుడు యేసు క్రీస్తువు
2. భువిలో మానవ జీవితము
సర్వము చెందును దేవునకు
నరుని పాపమును మన్నింప
జగమున ప్రేమను నెలకొల్ప
రక్షణ మార్గము చూపింప
స్వర్గ ద్వారమును తెరిపించ
ఇలలో వెలసిన దేవదేవుడు
లోకమాన్యుడు యేసు క్రీస్తువు