Lyrics: PaidiSree
Tune: unknown
Music: Naveen M
Album: లాలనుచు పాడరే - 6
ప. జోలాలి - జోలాలి - జోజోలాలి
మీ రాక మనుజాళికి మేలుకొలుపు
మీ నవ్వు లోకానికి పొద్దు పొడుపు ||2||
అ.ప. నడిరాతిరి ఉదయించిన
నజరేయుడా
బెత్లహేము పొత్తిలిలో
పవళించిన బాలుడా ||2||
జోలాలి - జోలాలి - జోజోలాలి
1. దూత పలికిలే.... ఈ చిన్ని కన్నులే
మనసులనే వెలిగించే మణిదీపాలౌనని
తార తెలిపెలే .... ఈ చిన్ని పెదవులే
ప్రేమ సుధలు ప్రవహించే
జలపాతాలెనని ||2||
చల్లనయ్యా...... చక్కనయ్యా
తెలవారే వరకైనా నీదురించవయ్యా ||2|| ||జో||
2. జ్ఞాని తెలిపిలే ..... ఈ చిట్టి చేతులే
పాపపు చీకటిలో మాకు కరదీపికలౌనని
మాకు తెలిసెలే .... చిట్టి పొట్టి
పదములే నవ జీవన పథము
చూపు అడుగు జాడలౌనని ||2||
చల్లనయ్యా .... చక్కనయ్యా
తెలవారే వరకైనా నిదురించవయ్యా ||జో||