Type Here to Get Search Results !

మధురమైన భావముతో ( madhuramaina bhavamutho Song Lyrics | Telugu Christian Songs Lyrics )

Lyrics: unknown || Tune: unknown 

Music: unknown || Album: unknown 


సా: పావన జనకా-జీవ పూర్ణుడగు దేవా 

వాత్యల్య హృదయా - కరుణామయా 

మహిమాన్విత నీ నామము-పూజ్యనీయం

నీకే సదా మహిమ ఆరాధనా ||3|| 


ప: మధురమైన భావముతో

మంజుల శుభరాగముతో 

మహిమాన్విత దేవుని 

ప్రియమార కొలిచెదము ||2|| 

సర్వశక్తిమంతుడు-సకలలోక పాలకుడు ||2|| 

ప్రణమిల్లుచు ముదమార పూజించెదము ||2|| ||మధురం|| 


1. భువి పైన ప్రభు చర్యలు ఘనమైనవి 

జనులెల్ల కీర్తించు - ప్రభునామము ||2|| 

క్షమియించు దైవం-కృపజూపు తండ్రీ ||2|| 

విశ్వాన్ని కాపాడును - ప్రియమార

విశ్వాన్ని రక్షించును ||మధురం|| 


2. ఈ లోకమునెంతో ప్రేమించెను

తన దివ్యసుతుని దయచేసెను ||2|| 

ఈ లోకపాపం-మనుజాళి శాపం ||2|| 

కృప జూపి తొలగించెను-ముదమార 

కృపజూపి క్షమియించెను ||మధురం|| 


Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads Section