Lyrics/Tune/Music/Prod: Fr. Lamu Jayaraju
Album: ఆలకించుమో దేవా
ప: ఆ....ఆ....
మనవులివే దేవా..
మమ్మాదరించగ రావా ||2||
పాప కూపము నుండి (ఈ) ||2||
నను లేవనెత్తుము ప్రభువా ||2||
1. బీడులాగ మారినది బాధలలో నా జీవితం ||2||
నీ కరుణ రస ధారలలో
విరియని నవ చైత్రమై ||2|| ||మ||
2. గవ్వ వంటిది నా హృదయం
ఎదురుచూచు ప్రతిక్షణం ||2||
స్వాతి చినుకు వంటిది
నీదు ప్రేమ కోసమై ||2|| ||మ||