lyrics: fr. alexander
music/tune: koka joseph ranjith
album: అద్వితీయుడు
ప. మన్నించవా నా దైవమా
నువు తప్ప నాకెవ్వరున్నారు ||2||
పాపమనే నిశీథిలో పడిపోయిన నన్ను ||2||
చేయిపట్టి వెలుగులోకి నడిపించవా ||మ||
1. ఏదో తెలియని ఆవేదన
తప్పు చేస్తున్నాననే భావన ||2||
అంతరాత్మను వేదిస్తున్న
అపవాధి క్రియలకు లోనైతిని ||2|| ||మ||
2. లోక ఆశలకు లోనైతిని
పరలోక చింతన మానితిని ||2||
లోకాన్ని జయించి గర్వించితిని
ఆత్మను కోల్పోయి విలపించితిని ||2|| ||మ||