Type Here to Get Search Results !

మేఘాలపైన రానై యున్న ( meghalapaina ranai yuna Song Lyrics | Telugu Christian Songs Lyrics )

Lyrics: unknown || Tune: unknown 

Music: unknown || Album: unknown 


పల్లవి: 

మేఘాలపైన రానై యున్న - యేసురాజును 

మహామహిమతో రానైయున్న - దేవదేవునికి 

రారండి స్వాగత మివ్వ - ఓ గొర్రెపిల్ల సంఘమా 

త్వరపడి వేగమే - రారండి .....llమేఘాll 


1 వ చరణం.. 

పరిశుద్ధులతో దూతలతో - వైభవంబుగా 

పరికింపగను పరవశముతో - పరమదేవుని 

పరిశుద్ధునిగా నీవుండెదవా - పరివర్తనతో 

నిలచెదవా పాపుల రక్షకుని చెంత - 

పసిడి మనసుతో నిలచెదవాllమేఘాll 


2 వ చరణం.. 

పసిపాపల హృదయాలతో - పావనమూర్తిని 

పవిత్రమైన చేతులతో - ఆరాధింపగను 

మహిమ ఘనత స్తుతియు - క్రీస్తుని యుగములన్నిట 

మహోన్నతుడైన దేవునికి - నిరతము స్తోత్రగానము llమేఘాll 


Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads Section