Lyrics: unknown || Tune: unknown
Music: unknown || Album: unknown
ప: స్వాగతం సుస్వాగతం
ఓ పూజ్య గురువా స్వాగతం ||2||
సువర్ణ జనిత విమల చరిత
ధీరోధాత్త ధర్మ నందన ||2||
సగసమాగస నిసగనిస
సగసని నిసనిస గమదని గమదని ||2|| ||స్వా||
1. పావన మాతకు జనియించితివి
సామాన్యునిగా జీవించితిని ||2||
అహమును విడిచి దీనత్వముతో
మాతృక చూపిన ఆదర్శమూర్తి ||స్వా||
2. పావన దేవుని ముక్తిని పొంది
సత్యము ధర్మము ప్రజలకు నేర్పి ||2||
దైవరాజ్యమిల స్థాపించుటకై
సిలువను మోసిన కారుణ్యమూర్తి ||స్వా||
3. స్వార్థము వీడిన త్యాగివి నీవే
సేవను వలచిన ప్రియుడవు నీవే
దైవ ప్రజలకు అభిషిక్తుడవై
విశ్వ సంఘమున వెలుగు దివ్యవై ||స్వా||