Type Here to Get Search Results !

స్వాగతం సుస్వాగతం ఓ యేసు దేవా ( swagatham suswagatham oo yesu deva Song Lyrics | Telugu Christian Songs Lyrics )

Lyrics: unknown || Tune: unknown 

Music: unknown || Album: unknown 


పల్లవి 

స్వాగతం సుస్వాగతం ఓ యేసు దేవా ||2|| 

నీ దివ్య రూపం మది కోవెలలో ||2|| 

నవ సుప్రభాతమై విరిసేను ||2|| 

వేల వన్నెల పూలతోటి మీకు మాలలల్లేము 

చైత్ర వీణల రాగ రమణితో మిమ్ము 

స్వాగతించేము సుస్వాగతం శుభస్వాగతం 

సుమస్వాగతం ఘనస్వాగతం ||2|| 


1 వ చరణం.. 

సూరీడువై మమ్ము మేలుకొలిపావు - ||2|| 

జాబిల్లివై మాకు జోల పాడావు ||2|| 

ఆకలైన వేళలో మా తల్లివైనావు 

కన్న తండ్రివై మాకు దారి చూపావు ||2|| 

ఎరువము స్వామీ ఏ నాటికి మీ మేలు|2||

నీ పాద ధూళియే మాకు పదివేలు ||సు|| 


2 వ చరణం.. 

మా పాటలో రాగాలు నీవే దేవా... ||2|| 

మా మాటలో భావాలు నీవే కావా ||2|| |

వినే చూసాము నీ నవ్వుల వెన్నెలలో ||2|| 

భువినే మరిచాము. 

నీ మమతల కోవెలలో ... ||2|| 

విడువకు దేవా మా చెయ్యి :ఏనాడు ||2|| 

పాపల్లే చేరాము నీ ఒడిలో ఈనాడు ||సు||


Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads Section