Lyrics: unknown || Tune: unknown
Music: unknown || Album: unknown
సా: తరలిరండి ఓ భక్త జనమా
కదలిరండి వధువు సంఘమా
స్వాగతం సుస్వాగతం
పూజాబలికి ఘనస్వాగతం
ప: తరలిరండి ఓ భక్త జనమా కదలిరండి
వదువు సంఘమాస
తండ్రి దేవుని స్తుతియింపగా
యేసు దేవుని కీర్తింపగా
ఆత్మ దేవుని ఘనపరచగా
తరలిరండి పూజాబలికి' - ||2||
స్వాగతం సుస్వాగతం ...
పూజాబలికి ఘనస్వాగతం
1. ద్రాక్షకు తీగకు సంబంధము
దేవునకు మనకు అనుబంధము
గురుశిష్యులకు ప్రేమ బంధము
విశ్వాసులకు మోక్షభాగ్యము ||తర|| ||సా||
2. మానవాళికి ముక్తినొసగగా
మహోన్నతుని మహిమ పరచగా
సర్వోన్నతుని స్తుతియింపగా
ఆత్మ దేవుని వరములు వేడగా ||తర|| ||సా||