Lyrics: unknown
Tune: unknown
Music: unknown
Album: సంగమం
సా: కొండ శిఖరాన దిక్కుతోచక నున్న నన్ను
కాపాడు వారెవ్వరు?
వ: భూమ్యాకాశాలను సృజించిన
నా దేవుడు నిన్ను కాపాడును
కొండ శిఖరాన దిక్కుతోచక నున్న
నిన్ను కరుణించును
నీ కాలు జారనీయక,
కనురెప్పలైనను మూయక,
సర్వ వేళలందు నిన్ను గాచును
ప: ఈ బాటసారికి నమ్మిక నీవే ||2||
ఈ బాటసారికి దైర్యము నీవే ||2||
ఆ బాటలో నా ప్రాణం నీవే ||2||
ఆ బాటలో నా గానం నీవే ||2||
నీవే మార్గం యేసయ్యా
నీవే సత్యం యేసయ్యా
నీవే జీవం యేసయ్యా
నీవే సర్వం యేసయ్యా
నీవే మార్గం నీవే సత్యం
నీవే జీవం యేసయ్యా
1. ఆశల శిఖరం వేదన అంతం ||2||
ఆర్తుల శరణం నీవే నీవే ||2||
అనురాగ దీపం అపురూప బంధం ||2||
అన్యోన్య ప్రేమ నీవే నీవే ||2||
2. నీవే నా మోక్షం, నీవే నిరీక్షణం ||2||
ఆత్మానందం నీవే నీవే ||2||
ఇహలోక సౌఖ్యం పరలోక భాగ్యం ||2||
నిత్యానందం నీవే నీవే ||2||