Type Here to Get Search Results !

దేవా నిన్ను పాడే సమయం ( deva ninnu pade samayam Song Lyrics | Telugu Christian Songs Lyrics )

Lyrics: unknown || Tune: unknown 

Music: unknown || Album: unknown 


దేవా నిన్ను పాడే సమయం 

మంచి సమయం ||2|| 

కష్టమైన శోధనయినా నిన్ను పాడెదన్

నిన్ను స్తుతియించెదన్ ||2|| ||దేవా|| 


1. నావా ఒంటరిగా సాగుతుండగా

నాధా నిన్నే పాడెదను 

జీవితములో నీవుండగా 

ఎవరిని గూర్చి పాడెదను 

శతకోటి పాటలు నిను గూర్చి పాడిన 

నా ఆశ ఎన్నటికి తీరదయా 

కడవరకు నిన్ను కీర్తించి పొగడెద 

ప్రాణా నాధుడా-నా జీవ నాధుడా ||దేవా|| 


2. దేహమంతా కృశియించినా 

వాడి నశియించి పోయినా 

రక్త ధారలే ప్రవహించగా 

మరణమాసన్న మయినను 

క్షణమైన నిన్ను స్తుతియించ మరచిన 

జీవిత పయనము వ్యర్థమయా 

జీవమిచ్చిన నిన్ను కీర్తించి పొగడెదా

ప్రాణా నాధుడా-నాజీవ నాధుడా ||దేవా|| 


Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads Section