Lyrics: unknown || Tune: unknown
Music: unknown || Album: unknown
ప. దేవా నీవే నా దేవుడవు
నీకై తపియించుచున్నాను ||2||
త్వరపడి నీవె పరుగిడి రావ
ఊరటను నాకు కలిగించవా
దయామయా దయచూపవా
నీమోము నాకు చూపించవా
1. నీరులేక ఎండిపోయిన నేల
వర్షానికై వేచి యుండునట్లు
నా హృది నీకై వేచియున్నది
రావా దేవా నన్ను బ్రోవుమా ||2||
2. దాహమువేయు లేడిపిల్ల నీటికై
ప్రవహించు సెలయేరుకై పరిగిడినట్లు
నీ జీవ జలముకై నా ఆత్మ నేడు
అతిగా తృష్ణ కలిగిఉంది వేగమే రావా ||2||