Lyrics/Tune/Prod: Fr. Lamu Jayaraju
Music: Naveen M
Album: ఆలకించుమో దేవా
ప. దేవా...మా ప్రభువా... ఆలించుమా ప్రార్ధన||2||
నీ పాద సన్నిధి చేరితిమి
నీ వాక్యవిందుకై వేచియుంటిమి ||2||
మాట్లాడే దేవా మాతో మాట్లాడుమయా
మాట్లాడి మార్గమును నేర్పించుమయా ||2||
1. ఈరోజు మేమంతా గుమికూడి వుండగా
నీ ఆత్మను మా పైన కుమ్మరించుమ ||2||
ఇస్రాయేలు ప్రజలను నడిపించిన రీతి
నీ హస్త నీడలో మమ్ము నడుపమయా ||2|| ||మా||
2: నీ దివ్య మార్గములో -స్థిరముగా పయనించ
నీ వాక్యము నందు మమ్ము ప్రతిష్టించుమా
నీ ప్రేమ పలుకులను-శ్రద్దగా ధ్యానించు ||2||
మాజ్ఞాన నేత్రములను తెరువుమయ్యా ||2|| ||మా||