జ్ఞానులు తెచ్చిరి కానుకలు
Jnanulu techiri kanukalu song | Telugu christmas songs
జ్ఞానులు తెచ్చిరి కానుకలు - సుదూర సీమల నుండి
ఆనందంతో అర్పించిరి - చిన్నారి యేసును చూచి
బంగారు సాంబ్రాణి పరిమళ ద్రవ్యాలతో
ఆరాధించిరి దేవుని కొమరుని - అర్పించగరండి ఓ దైవజనమా ||2||
మీ ప్రేమ కానుకలు దివ్యమైన తలంపులు
ప్రియమైన హృదయంతో దివ్య బాలయేసునకు
1 వ చరణం..
లోకాన్ని ఎంతో ప్రేమించిన పరలోక దేవుడు ఉన్నతుడు
తన దివ్య సుతుని అర్పించిన ఆ తండ్రి ప్రేమ శాశ్వతము
దైవరాజ్యమును స్థాపింప నూతన జగమును నిర్మింప
పుడమిన పుట్టిన దేవ దేవుడు నరావతారుడు యేసు క్రీస్తువు
2 వ చరణం..
భువిలో మానవ జీవితము సర్వము చెందును దేవునకు
నరుని పాపమును మన్నింప జగమున ప్రేమను నెలకొల్ప
రక్షణ మార్గము చూపింప స్వర్గ ద్వారమును తెరిపించ
ఇలలో వెలసిన దేవదేవుడు లోకమాన్యుడు యేసు క్రీస్తువు