Lyrics: Fr. Dusi Devaraj
Tune: Fr. D.V. Prasad
Music: Dattatreya
Album: జీవశృతి - 3
ప. జననీ ఓ మరియా చల్లని మాతవమ్మ
జీవిత యానములో మాతోడుగా నిలువుమమ్మా ||2||
1. శుభములు గూర్చు నీనామం
నిరతమునాలో స్మరియించూ ||2||
మధురము నీ ప్రేమ
ఎడబాయని నీ కరుణా ||2|| ||జననీ||
2. వెన్నెల వంటి నీమమతా
సుధలను నాలో కురిపించూ ||2||
స్వర్గమే నీ హృదయం
కమనీయమే నీ వదనం ||2|| ||జననీ||
3. ఆశలు తీర్చునీ జపమూ
ఆపదలో మా స్థిరచరణం ||2||
చెరగదు ఈ బంధం
విడిపోని ఈ అనుబంధం ||2|| ||జననీ||