Type Here to Get Search Results !

జన్మపాప రహితోద్భవి ( janma papa rahithodhbavi Song Lyrics | Telugu Christian Songs Lyrics )

Lyrics: unknown 

Tune: unknown 

Music: Dr. PJD Kumar 

Album: ద్రాక్షావల్లి 


ప. జన్మపాప రహితోద్భవి 

జగదీశ్వరుని జననీ 

జగజగములకు జననిగ నిలిచే

జపమాల మాత ||2|| 


1. పరమతండ్రికి ప్రియమైన బిడ్డగ

పరిశుద్ధాత్మ ఆవహింపగ 

పరమసుతునికే మాతవైతివి 

పరిశుద్ధతకే రాణివైతివి ||2|| 


2. పశ్చాత్తప్తుల ఆనందదాయిని

శరణను వారిని ఆదుకొంటిని 

దీనులమగు మము ఆదరించి

మీ ప్రియసుతుని వేడుము తల్లి ||2|| 


3. దైవసుతునికే మందసమైతివి

సత్యసువార్తకే నిలయమైతివి

దైవ సేవను చేయువారిని 

కాయుము తల్లి అనవరతం “జన్మపాప" ||2|| 


Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads Section