Type Here to Get Search Results !

ఏ గుడిలో పుడితేనో కాదు జయంతి | Ye gudilo puditheno kadu jayanthi song


ఏ గుడిలో పుడితేనో కాదు జయంతి

Ye gudilo puditheno kadu jayanthi

పల్లవి 

ఏ గుడిలో పుడితేనో కాదు జయంతి

యేసు నా గుండెలో పడితేనే క్రీస్తుజయంతి ||2|| 

నా ఊరు నజరేతు నా ఇల్లే బెత్లహేము ||2|| 

పుట్టబోవు నా ప్రభువుకు పశులపాక నేనౌతా ||2|| 


1 వ చరణం.. 

అస్తమించి నాడెపుడో

నా బ్రతుకున సూర్యుడు 

అలవిగాని పాపపు చలి 

అయ్యో వణికిస్తున్నది

నడిరాతిరి బ్రతుకునాది 

కలల మంద కాపునాది ||2||

మరియతల్లి మదినున్నది 

నాలో ఉదయించరావా 

ప్రభువా .. బాలదేవా..

రావా నను బ్రోవవా ||2||ఏ|| 


2 వ చరణం.. 

ఊరు పేరు లేని పల్లె నజరేతును మార్చినావు

గొల్లవారి బ్రతుకులలో 

గొప్పమార్పు తెచ్చినావు 

లోకపు పోకడలు మార్చి 

చరితమే తిరగ రాసి ||2|| 

భవితమే మార్చినావు 

నా బ్రతుకును మార్చరావా

ప్రభువా .. బాలదేవా

రావా నను బ్రోవవా ||2||ఏ|| 


3 వ చరణం..  

పేదగ పుడతానంటే నిరుపేదను నేనౌతా

దీనాత్మను కోరితే దీనుడనై బ్రతుకుతా 

నాకున్న సిరులన్ని కన్న కలలన్ని ||2|| 

పశులపాక పరిచాను ప్రభువా 

పవళించరావా ప్రభువా... బాలదేవా... 

రావా నను బ్రోవవా ||2||ఏ||


Document

Your download link will appear in 10 seconds.

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads Section